SLBC టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మందిలో గతంలో ఒక డెడ్ బాడీని రెస్క్యూ బృందాలు గుర్తించగా.. తాజాగా మరో మృతదేహం లభ్యమైంది. లోకో ట్రైన్ శిథిలాల కింద డెడ్ బాడీని రెస్క్యూ బృందాలు గుర్తించి తవ్వకాలు చేపట్టాయి. ఒక కాలు కనిపించడంతో తవ్వకాలు జరుపుతున్నారు. ఫిబ్రవరి 22న ప్రమాదం జరగగా 8 మంది టన్నెల్ లోపల చిక్కుకుపోయారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా, ఇంకా ఆరుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.