TG: నాగర్‌కర్నూల్‌లోని ఎస్ఎల్‌బీసీ సొరంగంలో మంగళవారం ఉదయం మరో మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నాగర్ కర్నూల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. మొత్తం 8 మంది టన్నెల్‌లో గల్లంతు కాగా, ఇద్దరి మృతదేహాలను ఇప్పటి వరకు వెలికి తీశారు. మరో ఆరుగురి కోసం రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి.