నటి కస్తూరిపై మరో కేసు నమోదు

తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిపై తమిళనాడులో బుధవారం మరో కేసు నమోదైంది. అంటిపట్టి పోలీస్ స్టేషన్‌లో 2 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మధురై తిరునగర్ పోలీస్ స్టేషన్‌, తిరుచ్చి, చెన్నైలో కస్తూరిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కస్తూరిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె తెలుగులో అన్నమయ్య, డాన్ శ్రీను వంటి సినిమాల్లో నటించారు.

సంబంధిత పోస్ట్