మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాల మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో చీతా మృతి చెందింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 ఏళ్ల ఆడ చీతా 'నభా'.. గాయాల కారణంగా మృతి చెందింది. వారం రోజుల క్రితం వేటాడే సమయంలో నభా తీవ్రంగా గాయపడినట్లు చీతా ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్ ఉత్తమ్ శర్మ తెలిపారు. వారం రోజులుగా చికిత్స అందించామని, అయితే గాయాలు తీవ్రంగా అవ్వడంతో మరణించినట్లు వెల్లడించారు.