SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోనే ఉంది. అయితే టన్నెల్‌లో మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు రెస్క్యూ అధికారులు తెలిపారు. టన్నెల్‌లో లోపల నిమిషానికి 5వేల లీటర్ల ఊట నీరు ఉబికి వస్తుందని పేర్కొన్నారు. దీంతో భారీగా బురద ఏర్పడి మృతదేహాలను వెలికితీయడానికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మరో ప్రమాదం తప్పదని వెల్లడించారు.