అఫ్గానిస్థాన్‌లో ఇవాళ గంటల వ్యవధిలో రెండు సార్లు భూకంపం సంభవించింది. కాబూల్‌లో భారీ భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. శుక్రవారం అర్ధరాత్రి 3.16 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రతతో, ఉదయం 7గంటలకు 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. ఇటీవల సంభవించిన భూకంపంలో 2205 మంది మరణించిన సంగతి తెలిసిందే.