ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరిగుండం అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్