AP: మరో కుటుంబం గోదావరిలోకి దూకింది. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ వంతెన వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. తణుకుకు చెందిన శ్రీనివాస్ (45), పద్మ (42), వారి ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకారు. స్థానిక జాలర్లు గమనించి పద్మను ఒడ్డుకు చేర్చారు. ఆమెను పాలకొల్లు ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్, ఇద్దరి పిల్లల కోసం గాలిస్తున్నారు. ఆర్థిక సమస్యలతోనే కుటుంబం గోదావరిలో దూకినట్లు అనుమానిస్తున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితమే రాజమండ్రి బ్రిడ్జిపై నుంచి ఏఈ నూకరాజు ఫ్యామిలీ గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.