హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో మరో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్న ప్రాంతంలో ఖానామెట్‌లోని మీనాక్షి టవర్స్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా, శనివారం నాలెడ్జ్ సిటీలోని ఓ భవనంలోని 5వ అంతస్తులో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.