ఏషియన్ గేమ్స్‌: షూటింగ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం

ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కైనన్ చెనై, నీరూ ధాండా జోడీ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో 34 స్కోరు సాధించి విజేతగా నిలిచింది. దీంతో ఖతార్ పేరిట ఉన్న ఆసియా రికార్డును భారత రికార్డును అధిగమించారు. ఈ విజయంతో భారత్ ఖాతాలో 9 స్వర్ణ పతకాలు చేరాయి. ఖతార్‌కు రజతం, చైనాకు కాంస్య పతకాలు దక్కాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕