అభిషేక్ శర్మ మరో గోల్డెన్ డక్.. వారి సరసన చేరిక

న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తన మొదటి బంతికే గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మాట్ హెన్రీ బౌలింగ్‌లో క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఇది ఈ సిరీస్‌లో అతని రెండో గోల్డెన్ డక్. అంతర్జాతీయ టీ20ల్లో తొలి బంతికే ఔటైన భారత ఓపెనర్ల జాబితాలో కేఎల్ రాహుల్, పృథ్వీ షా, రోహిత్ శర్మ, సంజు శాంసన్‌లతో పాటు అభిషేక్ కూడా చేరాడు. అలాగే, టీ20ల్లో అత్యధిక గోల్డెన్ డక్‌లు సాధించిన భారత ఓపెనర్ల జాబితాలోనూ (రెండు గోల్డెన్ డక్‌లతో) చేరాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్