బంగ్లాదేశ్‌లో జై మహాపాత్ర అనే మరో హిందువు హత్య!

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా సునమ్‌గంజ్‌ జిల్లా భంగాడోహోర్‌ గ్రామంలో జై మహాపాత్ర అనే 19 ఏళ్ల హిందువు మృతి చెందాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో అమీరుల్‌ ఇస్లాం అనే వ్యక్తి దాడి చేయడంతో మహాపాత్ర తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆంగ్ల మీడియా తెలిపింది. విద్యార్థి నాయకుడు ఉస్మాన్‌ హాదీ హత్య అనంతరం హిందువులపై హింస పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్