కనక దుర్గమ్మ గుడిలో మరో అపచారం.. పాలలో పురుగులు

AP: బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో మరో అపచారం జరిగింది. శ్రీ చక్ర నవావరణార్చన పూజకు వినియోగించే పాలలో పురుగులు కనిపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమ్మవారి సన్నిధిలోని నూతన పూజా మండపంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకోగా.. శనివారం వెలుగులోకి వచ్చింది. అమ్మవారి అర్చనకు ఆవుపాలకు బదులు పురుగులున్న టెట్రా ప్యాకెట్ పాలు వాడటంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దాంతో పూజను అర్ధగంట నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్