పీజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ఓ పీజీ విద్యార్థిని ప్రియుడితో కలిసి బయటకు వెళ్లింది. రాత్రి 11గ.లకు ఎయిర్‌పోర్టు వద్ద కారులో ఉండగా అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు అద్దాలు పగులగొట్టి ప్రియుడిని తీవ్రంగా కొట్టారు. ఆమెను దూరంగా షెడ్‌లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు బాధితులను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్