కొత్తగా మరో లక్ష పెన్షన్లు కట్!

TG: రాష్ట్ర ప్రభుత్వం 'లైవ్ అథెంటికేషన్' ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో అనర్హులైన పెన్షన్ దారుల ఏరివేతను వేగవంతం చేసింది. ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటివరకు లక్ష మందికిపైగా అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో అనర్హుల పేర్లను తొలగించి.. అర్హులకు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కొత్తగా 2 లక్షల మంది లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే మొదలుపెట్టగా, తాజాగా గుర్తించిన అనర్హుల స్థానంలో మరో లక్ష మందికి పెన్షన్లు ఇవ్వనుంది. దీంతో కొత్త పెన్షన్ల సంఖ్య మూడు లక్షలకు చేరే ఛాన్స్ ఉంది.

సంబంధిత పోస్ట్