AP: దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో కొత్తగా అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి, తీవ్ర అల్పపీడనంగా మారి, తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ వాతావరణ మార్పుల కారణంగా నవంబర్ 2 మరియు 3 తేదీల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 'అర్నబ్' తుఫాన్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకముందే మరో కొత్త వ్యవస్థ ఏర్పడటం గమనార్హం.