TG: మొంథా తుఫాన్ తీరం దాటినా, మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది రాగల 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌లో అల్పపీడనంగా మారే అవకాశముందని అంచనా వేశారు. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.