టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన ఖాతాలో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో మరో సక్సెస్ చేరింది. దీంతో అనిల్ రావిపూడి తదుపరి సినిమాపై ఆసక్తి నెలకొంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనిల్ ప్లాన్ చేస్తున్నారు. తన తదుపరి సినిమా కోసం ఇప్పటికే ఒక ఐడియా క్రాక్ అయిందని, అందులో వెంకటేష్ హీరోగా నటించనున్నట్లు సమాచారం.