పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత షూటర్ స్వప్నిల్ సత్తా చాటాడు. ఫైనల్స్‌లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలుచుకున్నాడు. దీంతో భారత్ ఇప్పటివరకు మూడు పతకాలను గెలుచుకుంది.