వలసదారుల నియంత్రణలో భాగంగా అమెరికా ప్రభుత్వం మరో కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఇకపై అమెరికాయేతర పౌరులు దేశంలోకి ప్రవేశించే టైంలో లేదా బయలుదేరే సమయంలో వారి ఫొటోలను తప్పనిసరిగా తీయనున్నారు. ఈ నియమం గ్రీన్‌కార్డు హోల్డర్లతో పాటు అందరికీ వర్తిస్తుంది. వలసదారుల కదలికలను పర్యవేక్షించడమే దీని ఉద్దేశం. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం డిసెంబరు 26 నుంచి అమల్లోకి రానుంది.