మరో బాంబు పేల్చిన ఒరాకిల్.. లక్షా 60 వేల మంది ఉద్యోగులకు మెయిల్స్

ఒరాకిల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా లక్షా 60 వేల మంది ఉద్యోగులకు మెయిల్స్ పంపింది. AI ప్రభావం, కంపెనీ మూలధన వ్యయాల కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని, మరో విడతలో మరికొన్ని వేల మందిని తొలగించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే 30 వేల మందిని తొలగించిన ఒరాకిల్, ఈ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఈ లేఆఫ్స్‌ను అమలు చేస్తోంది. అమెరికా ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకేజీగా జీతం అందిస్తోంది. ఈ పరిణామాలతో ఐటీ నిపుణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

సంబంధిత పోస్ట్