రేషన్ కార్డులు పంపిణీతో మరొక హామీ నెరవేర్చాం: పొంగులేటి

తెలంగాణలో కొత్తగా 5 లక్షల 61 వేల రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. 27.83 లక్షల మంది అదనపు సభ్యులను రేషన్ కార్డుల్లో నమోదు చేశామని.. దీని ద్వారా ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం ద్వారా ప్రజా ప్రభుత్వం మరొక హామీని నెరవేర్చిందన్నారు. సూర్యాపేట(D) తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్