పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా హీలియం గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో MRI స్కాన్ ధరలు భారీగా పెరగనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖతార్‌లో సరఫరా అంతరాయం, హర్మూజ్ జలసంధి మార్గంలో సమస్యల వల్ల పరిస్థితి మరింత తీవ్రతరమైంది. హీలియం గ్యాస్ వైద్యరంగం, సెమీ కండక్టర్లు, ఏరోస్పేస్ వంటి కీలక రంగాల్లో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎంఆర్‌ఐ యంత్రాల పని తీరుకు ఇది అత్యవసరం. వార్ కారణంగా హీలియం సరఫరా తగ్గిపోవడంతో ఇతర రంగాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.