పాకిస్థాన్‌లో గుర్తు తెలియని గన్‌మెన్‌లు ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్ షేక్ యూసుఫ్ అఫ్రిదీని దుండగులు కాల్చి చంపారు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడైన అఫ్రిదీ మరణం సంస్థకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. గత నెలలో లష్కరే వ్యవస్థాపక సభ్యుడు అమీర్ హమ్జాపై కూడా కాల్పులు జరిగాయి. 2023 నుంచి పాకిస్థాన్‌లో ఇలాంటి మిస్టరీ హత్యలు పెరుగుతున్నాయి, ఈ ఏడాది ఇప్పటివరకు కనీసం 30 మంది కీలక ఉగ్రవాదులు హతమయ్యారు.