ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ యాత్రలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఓ భక్తుడు మృతి చెందాడు. అక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలోనే బండరాయి మీద పడటంతో ఓ భక్తుడు తీవ్రంగా గాయపడి మరణించారు. దీంతో ప్రస్తుతానికి ఆ రూట్లో యాత్రను నిలిపివేశారు. కాగా కేదార్‌నాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో ఉదయం ఏడుగురు చనిపోయిన విషయం తెలిసిందే.