మరో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం (వీడియో)

AP: రాష్ట్రంలో మరో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా చాబోలు జాతీయ రహదారిపై వేగ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి కర్నూలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. భారీ క్రేన్ సహాయంతో బస్సును రోడ్డుపై నుంచి తొలగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్