శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ డేటింగ్ వార్తల మధ్య మరో వీడియో వైరల్ అవుతోంది. యువరాజ్ సింగ్ నిర్వహించిన ‘YouWeCan’ ఈవెంట్‌లో సచిన్ కుటుంబం, క్రికెటర్లు ఒకే వరుసలో కూర్చొన్నారు. గిల్ సారాను చూసిన సమయంలో ఆమె తల్లి అంజలి తిరగడంతో, రవీంద్ర జడేజా సరదాగా గిల్‌ను ఆటపట్టించాడు. పక్కనే ఉన్న ఆటగాళ్ల నవ్వులు ఆ క్షణాన్ని ప్రత్యేకంగా మార్చాయి. ఈ వీడియోపై నెట్టింట చర్చలు మళ్లీ మొదలయ్యాయి.