తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దబోనాల పరిధిలో అరుదైన దృశ్యం కనిపించింది. శివలింగం ఆకారంలో చీమల పుట్ట స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణ చీమల పుట్టలకు ఇది భిన్నంగా.. శివలింగం ఆకారంలో ఉండటంతో ప్రజలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పెద్దబోనాల సమీప ప్రాంత ప్రజలు దీన్ని చూసేందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.