శక్తిమంతమైన ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తూ అమెరికా సర్కార్ ఆగ్రహానికి గురవుతోన్న కృత్రిమ మేధ సంస్థ ‘ఆంథ్రోపిక్’ తమ సరికొత్త ఏఐ మోడళ్లు ‘ఫ్యాబిల్ 5’, ‘మిథోస్ 5’ సేవలను నిలిపివేసింది. దేశ భద్రతా కారణాల రీత్యా ఈ మోడళ్లపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఆంథ్రోపిక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యాబిల్ 5ను విడుదల చేసిన మూడు రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా ప్రభుత్వం ఈ మోడళ్లపై భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తంచేసి, వాటిని విదేశీ పౌరులకు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.