రాగ్ మయూర్ హీరోగా, 'డీజే టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అనుమాన పక్షి'. మెరీన్ హీరోయిన్గా నటించగా, రాశి, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్ కీలక పాత్రలు పోషించారు. రాజీవ్ చిలకా, రాజేష్ జగతియాని, హిరాచంద్ దండ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ప్రతి విషయానికి అనుమానపడే హీరో క్యారెక్టరైజేషన్తో ఈ చిత్రాన్ని విమల్ కృష్ణ తెరకెక్కించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.