సాక్షులు ఎవరైనా ముందుకొచ్చి మాకు సాయం చేయండి: కేతన్‌ తండ్రి అభ్యర్థన

పుణె యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ లోహ్‌గఢ్‌లో కొండపై నుంచి తోసేయబడటంతో లోయలో పడి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుడి తండ్రి విశాల్ అగర్వాల్ మాట్లాడుతూ, కేసులో చాలామంది సాక్షులు ఉన్నప్పటికీ, వారెవరూ పోలీసులకు సహకరించడం లేదని ఆరోపించారు. సాక్షులు ముందుకు వచ్చి తమకు సహాయం చేయాలని ఆయన బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. కేతన్ మృతికి సంతాపంగా సోమవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

సంబంధిత పోస్ట్