ఫేక్ జర్నలిస్టులపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. "ఈ రోజుల్లో ఎవడు పడితే వాడే జర్నలిస్టునని చెప్పుకుంటున్నాడు. అ, ఆ, ఇ, ఈలు రాని వాళ్లు సైతం ఇంటి పేరు ముందు "జర్నలిస్ట్" అని ట్యాగ్ వేసుకుంటున్నారు. అలాంటి ఫేక్ జర్నలిస్టులను గుర్తించి వేరు చేయాల్సిన బాధ్యత నిజమైన జర్నలిస్టులదే. ఫేక్ జర్నలిస్టులు, నిజమైన జర్నలిస్టులు వేరు అని చెప్పాల్సిన అవసరం ఉంది" అని ముఖ్యమంత్రి అన్నారు.