AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం భేటీ కానుండగా.. కీలక అంశాలపై చర్చ సాగనున్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో SPB ప్రతిపాదనకు ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. రూ.44,776 కోట్ల విలువ చేసే 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలపనుంది. పంచగ్రామాల భూములకు ప్రత్యమ్నాయంగా అదే విలువ కలిగిన భూములు కేటాయింపునకు గతంలో నిర్ణయం తీసుకోగా.. ఈ కేబినెట్‌లో ఆమోదముద్ర పడే అవకాశం కనిపిస్తోంది.