సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ వర్చువల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పరిశ్రమల స్థాపన, మరియు ఉద్యోగ అవకాశాలపై సుదీర్ఘ చర్చలు జరిపి, మొత్తం 48 కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ కోసం 5.84 ఎకరాలు, సిలికాన్ క్రిస్టల్ తయారీ కోసం 91.10 ఎకరాల భూకేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 సవరణలు మరియు గ్రీన్ స్టీల్ ప్లాంట్ ప్రోత్సాహకాలపై నిర్ణయాలు తీసుకున్నారు.