ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో ఒక కాకి అరిచి పదే పదే విసిగిస్తుందని ఓ చికెన్ షాప్ యజమాని దాన్ని తాడుతో కట్టేశాడు.అయితే కాకిని కట్టేయడంతో అక్కడకు వందలాది కాకులు చేరుకుని అరవడం మొదలెట్టాయి. కాకుల గోలను భరించలేక మిగిలిన దుకాణదారులు ఇబ్బందులు పడ్డారు.వారు గోల చేయడంతో, చేసేదేమి లేక కట్టేసిన కాకిని చికెన్ సెంటర్ యజమాని వదిలేశాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.