ఏపీ ఫైబర్ నెట్‌లో ఉద్యోగుల తొలగింపు

AP: ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్‌లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సూర్య ఎంటర్‌ప్రైజెస్ ద్వారా నియమించిన సుమారు 500 మంది ఉద్యోగులు ఈ నెలాఖరులోగా రిలీవ్ కావాలని ఆదేశించింది. ఇక ముందు ఎటువంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. గతంలో వైసీపీ నేతలు చెప్పిన వారినందరిని అప్పటి యాజమాన్యం చేర్చుకున్నట్లు వచ్చిన ఆరోపణల మేరకు  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్