ఏపీ బాలికపై ఒడిశాలో సామూహిక అత్యాచారం

ఒడిశాలోని బెర్హంపూర్‌లో ఏపీకి చెందిన 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. సవతి తండ్రి వేధింపుల నుండి తప్పించుకోవడానికి ఇంటి నుండి పారిపోయిన బాలిక, బెర్హంపూర్‌ రైల్వే స్టేషన్ సమీపంలో పనిచేస్తుండగా, పరిచయమైన ఓ బాలుడు తన స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు బాలికను రక్షించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు, బాలిక పారిపోవడానికి కారణమైన సవతి తండ్రిపై కూడా కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్