బనకచర్ల పేరు మార్చి అనుమతులకు ఏపీ యత్నం: మంత్రి ఉత్తమ్

సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆల్మట్టి ఎత్తు పెంచవద్దని కోర్టు స్పష్టంగా చెప్పిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి CR పాటిల్ తో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టులను వ్యతిరేకించామని, పేరు మార్చి ఏపీ అనుమతులకు యత్నిస్తోందని అన్నారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు కోరామని మంత్రి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్