హైదరాబాద్‌లో జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

TG: హైదరాబాద్‌లో, ఏపి పోలీసులు ఓ జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు మూడు నెలల క్రితం కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని కేసు నమోదు చేసిన సమయంలోనే నోటీసులు జారీ చేసిన పోలీసులు, ఈరోజు రాత్రి వేళ ఇంటికి వచ్చి ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా, పోలీసులు ఆయన భార్య పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్