రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాటూరు వెంకటేశ్ అనే యువకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర జూన్ 19న రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మొదలైంది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మాజీ ఎంపీ వీహెచ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్‌ను సన్మానించి, ఆయనకు మద్దతు తెలిపారు. అనంతరం, వెంకటేశ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కూడా కలిసి తమ యాత్ర గురించి వివరించారు.