TG: నల్లగొండలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాకేంద్రం సమీపంలోని కొర్లపహాడ్ వద్ద హైవేపై ముందు వెళుతోన్న ఓ వాహనాన్ని తిరువూరు డిపోకు చెందిన ఏపీఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.