13 కేంద్ర ఉద్యోగాలు సాధించిన ఏపీ యువకుడు

AP: వైఎస్సార్ కడప జిల్లా రాజారెడ్డి వీధికి చెందిన నాగేంద్ర సాయి 2025లో ఏకంగా 13  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కష్టపడి చదవడంతోపాటు ఓపిక, సహనం ఉండాలని నాగేంద్ర తెలిపారు. పట్టుదలతో ముందుకు సాగితేనే జీవితంలో లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలమన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕