రష్యా ఆర్మీలో చిక్కుకున్న ఏపీ యువకులు (వీడియో)

AP: ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లిన ఏపీ యువకులు ఆర్మీలో చిక్కుకున్నారు. కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. విశాఖపట్నం నుంచి ఉద్యోగాల కోసం రష్యాకు ఐదుగురు యువకులు వెళ్లారు. మిలటరీలో ఫుడ్ ప్యాకింగ్ ఉద్యోగం ఉందని నమ్మించి తమను యుద్ధంలోకి పంపించారని వెల్లడించారు. తామంతా రష్యాలో చిక్కుకుపోయామని, భారత ప్రభుత్వం వెంటనే స్పందించి తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕