TG: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు జగన్మోహన్‌రావుతో పాటు కార్యదర్శి దేవరాజ్, కోశాధికారి శ్రీనివాసరావును అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. హెచ్‌సీఏలో అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తిన వ్యవహారంపై CID, ED విచారణ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్‌రావు, దేవరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వారిని సస్పెండ్ చేస్తూ గురువారం అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.