తెలుగు రాష్ట్రాల్లో యాపిల్ సాగు: ఫలించిన రైతుల ప్రయోగాలు

ఎముకలు కొరికే చలిప్రాంతాల్లో పండే యాపిల్ సాగును ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. నిన్నటి వరకు తెలంగాణాలో కొంతమంది రైతులు యాపిల్ సాగును ప్రయోగాత్మకంగా చేపడితే, నేడు ఏపీలో కూడా యాపిల్ సాగును చేపట్టి కాయలు కాసేలా ప్రయోగాలకు తెరతీస్తున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచర్ల మోటు సమీపంలో ఓ రైతు కర్నాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన తక్కువ చలిలో కూడా పండే యాపిల్ మొక్కలను నాటగా, ఏడాది తర్వాత నేడు కాయలు కాయడం ప్రారంభించాయి. మరో రెండు నెలల్లో పూర్తిస్థాయి పంట చేతికి వస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్