యాపిల్ తొలి మడతపెట్టే ఐఫోన్ నమూనా చిత్రాలు వైరల్!

యాపిల్ సంస్థ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలి మడతపెట్టే ఐఫోన్ నమూనా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సాంకేతిక నిపుణుడు సన్నీ డిక్సన్ పంచుకున్న ఈ చిత్రాల్లో, పుస్తకంలా విచ్చుకునే ఈ ఫోన్ ఆకర్షణీయంగా, ఆధునిక సాంకేతికతకు నిదర్శనంగా కనిపిస్తోంది. తెరిచినప్పుడు చిన్న టాబ్లెట్‌లా మారే ఈ ఫోన్, ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌తో పోలిస్తే వెడల్పుగా ఉంటుంది. దీని లోపలి తెర ఐప్యాడ్ మినీ పరిమాణంలో, బయట నోటిఫికేషన్ల కోసం చిన్న స్క్రీన్‌తో ఉండే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్