అమర్‌నాథ్ యాత్రకు దరఖాస్తులు వెల్లువ

పహల్‌గామ్ ఉగ్రదాడి తరువాత అమర్‌నాథ్ యాత్రపై ప్రభావం పడుతుందన్న అనుమానాలను యాత్రికులు పచా పంచలు చేశారు. భద్రతా పరిస్థితులపై భయం లేకుండా లక్షల సంఖ్యలో భక్తులు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. జమ్ముకశ్మీర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 3.31 లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్ యాత్ర కోసం నమోదు చేసుకున్నారు. జూలై 3న ప్రారంభమయ్యే ఈ యాత్ర, ఆగస్టు 9వ తేదీన ముగియనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్