అకౌంట్‌లోకి రూ.6,000.. ఇలా అప్లై చేసుకోండి!

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది. ఏటా రూ.6,000 మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఇటీవల అనర్హులను తొలగించి, కొత్తగా 10 లక్షల మందికి పైగా రైతులను చేర్చుకున్నారు. 22వ విడతలో 9.45 కోట్ల మంది లబ్ధి పొందగా, 23వ విడత జులైలో విడుదలయ్యే అవకాశం ఉంది. మే, జూన్ నెలల్లో దరఖాస్తు చేసుకునే రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఆన్‌లైన్‌లో pmkisan.gov.in ద్వారా లేదా మీ-సేవా కేంద్రాల ద్వారా రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్