రైతు బీమా పథకానికి అర్హులైన రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోని వారు ఆగస్టు 5 వరకు అప్లై చేసుకోవచ్చు. 18-59 ఏళ్ల వయసు ఉన్న వారు ఏఈవోలకు అప్లికేషన్లు ఇవ్వాలి. రైతులు పట్టాదార్ పాస్ బుక్ లేదా డిజిటల్ సంతకం చేసిన డీఎస్ పేపర్, ఆధార్, నామినీ ఆధార్ కార్డు జత చేయాలి. ఈనెల 28 వరకు పట్టాదారు పాసుబుక్ పొందిన వారూ అర్హులేనని వ్యవసాయ శాఖ పేర్కొంది.