పల్లెటూర్లలో సులభంగా దొరికే నేరేడు పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సీజనల్ ఫ్రూట్. ఇందులో ఉండే జాంబోలిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. పెక్టిన్ అనే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆంథోసయానిన్స్ రక్త శుద్ధికి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. పొటాషియం, ఐరన్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే మితంగా తీసుకోవడం, గింజల పొడికి వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం.